మధ్యతరగతి బతుకుల్ని
అధిక ధరలు మండిస్తూనే ఉన్నాయి
రూపాయి పతనంతో
సగటు జీవనం కుతకుతమంటూ
ఉడుకుతూనే ఉంది
ఐదేళ్లూ రాజకీయ వాసన
గుప్పుమంటూనే ఉంది
పొత్తుల గోలలు
మిన్నంటుతూనే ఉన్నాయి
అధికార కుర్చీనే లక్ష్యంగా
పావులు కదులుతూనే ఉన్నాయి
కసరత్తుల కత్తులు నూరుతూనే ఉన్నాయి
ఎప్పుడో సచ్చిన
నరకాసురుడి వధ తంతు
విసిగేస్తోంది
కొత్త రాకాసులు ఇంకా భూమిపై
పగలబడి నవ్వుతూనే ఉన్నారు
వ్యవస్థని దారి మళ్లిస్తున్నారు
దేశాన్ని అమ్ముకుంటూ
అంగడి సరుకుగా మార్చారు
పేదల పొదరిల్లు బతుకుల్ని
ముళ్ల పొదలుగా మార్చేశారు
తంతు మారాలి
అస్తవ్యస్త బ్రతుకులు మారాలి
చీకటిని చిదిమి
పేదల బతుకుల్లో వెలుగులు నింపాలి
కుహనా అరా(జ)చకీయ సంస్కృతిని
తగులబెట్టి నిజ వెలుగుల్ని
ఇప్పుడు ఆస్వాదించి ఆనందించాలి...
మహబూబ్ బాషా చిల్లెం
9502000415