Dec 16,2022 12:02

నందిగామ టౌన్‌ : నందిగామ పట్టణం శ్రీ విద్య స్కూల్‌ రోడ్డు వద్ద చందర్లపాడు మండలం గుత్తవారిపాలెం గ్రామానికి చెందిన టిడిపి నేత రాటకొండ సీతారామాంజనేయులు ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. వారిని వారి స్వగఅహంలో కలుసుకొని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులను తంగిరాల సౌమ్య తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌, స్థానిక టిడిపి నేతలు, తదితరులు పాల్గొన్నారు.