ప్రజాశక్తి-తాళ్లరేవు (కాకినాడ) : తాళ్లరేవు మండలం సుంకరపాలెం బైపాస్ జంక్షన్ జాతీయ రహదారి 216పై టిడిపి శ్రేణులు రాస్తారోకో చేశారు. లారీ, ట్రాక్టర్ టైర్లు తగలబెట్టి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ప్రజాస్వామికమని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం యానం ఎదురులంక బాలయోగి వారధిపై రాస్తారోకో చేయడంతో అటు అమలాపురం కాకినాడ వైపు ట్రాఫిక్ స్తంభించింది. ఈ కార్యక్రమంలో మోపూరి వెంకటేశ్వరరావు, ధూళిపూడి వెంకటరమణ, కట్ట త్రిమూర్తులు, వాడ్రేవు వీరబాబు, పొన్నమండ రామలక్ష్మి, మందాల గంగ సూర్యనారాయణ, టేకుమూడి లక్ష్మణరావు, జక్కల ప్రసాద్ బాబు, మోర్త బైరమూర్తి, వాసంశెట్టి శ్రీనివాస్, రోళ్ల చక్రవర్తి, మల్లాడి వరదరాజు, బోయిడి వేణుగోపాల్ పెద్ద ఎత్తున టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.










