హైదరాబాద్: ఇటీవల అనారోగ్యంతో మరణించిన దిగ్గజ సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు నివాసానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేరుకుని కృష్టంరాజు భార్య, పిల్లలు, హీరో ప్రభాస్‌ను కేంద్రమంత్రి ఓదార్చారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఫిల్మ్‌నగర్‌లో జరిగే కఅష్ణంరాజు సంస్మరణ సభలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొననున్నారు. సాయంత్రం 4:20 గంటలకు కేంద్రమంత్రి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. రాజ్‌నాథ్ వెంట కిషన్ రెడ్డి , లక్ష్మణ్, చింతల తదితరులు ఉన్నారు.