Oct 24,2023 13:00

ధవళేశ్వరం (తూర్పు గోదావరి) : ఆర్‌టిసి బస్సు-స్కూటీని ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం ధవళేశ్వరంలో జరిగింది. కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్లే ఆర్‌టిసి బస్సు ధవలేశ్వరంలోని స్థానిక బార్సు హై స్కూల్‌ జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో స్కూటీ మీద వెళుతున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీ పైనున వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.