ప్రజాశక్తి- మోతుగూడెం (అల్లూరి) : ఆర్‌టిసి బస్సు, వ్యాన్ ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో వ్యాన్ డ్రైవర్‌కు, 30 మంది ప్రయాణీకులకు గాయాలైన ఘటన మంగళవారం తెల్లవారుజామున అల్లూరి జిల్లా, చింతూరు మండలం మోతుగూడెం పరిధిలో జరిగింది. ఫార్బరు గ్రామం వద్ద ఈరోజు తెల్లవారుజామున గోకవరం డిపోకి చెందిన ఆర్‌టిసి బస్సు అప్పర్ సీలేరు నుండి రాజమండ్రికి వెళుతుండగా, నిత్యావసర వస్తువులతో ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. బస్సులో ఉన్న 30 మంది ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడినవారిని ఏపీ జెన్ కో హాస్పటల్ కీ తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.










