
జాతీయత గురించి, దేశభక్తి గురించి ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు (ఆర్.ఎస్.ఎస్), దాని అనుబంధ సంస్థలైన బిజెపి, భజరంగదళ్, విశ్వ హిందూపరిషత్, ఎబివిపి వంటివి చేస్తున్న బాకా ప్రచారం విన్నవాళ్లెవరికైనా దేశ స్వాతంత్రోద్యమంలో ఈ ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి పరివారం అనన్య సామాన్యమైన పాత్ర పోషించి ఉంటారని భావిస్తారు. కానీ అలా భావించడం అంటే తప్పులో కాలేయడమే. ఆర్‌ఎస్‌ఎస్ 1925లోనే ఆవిర్భవించినా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న ఒక్క ఎన్నదగిన నాయకుడైనా దానికి లేకపోవడం యాధృచ్ఛికం కాదు. ఎందుకంటే బ్రిటిష్ సామ్రాజ్యవాద వలసపాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్రోద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్ శక్తులు ఏనాడూ భాగస్వామి కాలేదు. పైగా ఆ సంస్థ దాని రూపమైన హిందూ మహాసభ బ్రిటిష్ వారితో అడుగడుగునా కుమ్మక్కై, జాతీయోద్యమానికి తీవ్ర ద్రోహం చేశాయి. జాతీయోద్యమంలో పాల్గొన్న దాని ఒక్కగానొక్క నాయకుడు విడి సావర్కర్ కూడా బ్రిటిష్ వారికి అండర్ టేకింగ్ ఇచ్చి, ఉద్యమానికి ద్రోహం చేశాడు.. అలా జైలు నుండి బయటపడ్డాడు.
రూ.30/- పేజీలు : 32
ప్రజాశక్తి అన్ని బ్రాంచీలలో లభిస్తాయి.