జగనన్న సురక్షతో సత్వర పరిష్కారం : ప్రభుత్వవిప్, శాసనసభ్యులు సామినేని ఉదయభాను
ఎన్‌టిఆర్ : జగనన్న సురక్షతో సత్వర పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వవిప్, శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గం, వత్సవాయి మండల పెద్దమోదుగుపల్లి గ్రామం వద్ద శుక్రవారం జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ ... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతుందని సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళు గా భావిస్తూ పరిపాలన సాగుతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో నాడు నేడుతో పాఠశాలల రూపురేఖలు మారుస్తూ గ్రామ సచివాలయ వ్యవస్థతో పరిపాలనను ప్రజల వద్దకు చేరుస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు. గత చంద్రబాబు పాలనలో గ్రామాలకు రెండు లక్షల రూపాయలు కూడా కేటాయించని పరిస్థితి ఉండేదని నేడు జగనన్న పాలనలో ఇదే గ్రామం వద్ద వివిధ సంక్షేమ పథకాల ద్వారా నాలుగేళ్లలో 10 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూర్చామన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు కళ్యాణం సాగర్, నేలవెళ్లి వెంకటప్పయ్య, ఎంపీపీ కొలుసు రమాదేవి, జడ్పిటిసి యేసుపోగు దేవమని, మండల సచివాలయాల కన్వీనర్ లేళ్ల నాగేందర్ రెడ్డి, చేనేత విభాగం అధ్యక్షులు పెంటి శ్రీనివాస్, పాలకేంద్రం అధ్యక్షులు కళ్యాణం రామారావు, గ్రామ పార్టీ అధ్యక్షుడిగా కళ్యాణం నాగరాజు, తదితర గ్రామాల ముఖ్య నాయకులు, అధికారులు, సచివాలయ కన్వీనర్లు గృహసారధులు పాల్గొన్నారు.










