Jan 08,2023 10:32

భూకబ్జా బకాసురుడా
ప్రజా ఖజానా లూటీ ఘాతకుడా..
విద్య, వైద్యం, ఉపాధి వ్యాపార కుబేరుడా
సంక్షేమవారసుడా..సంక్షోభó కారకుడా..
దేశ పాలకుడివా..!
దళారీ పాలకుడివా ..!
పీడకుడివా..?
ప్రశ్నించటమే నేరమా.!?
అడగటమే అన్యాయమా..!?
వ్యతిరేకించటమే శాపమా..?
హక్కులంటే..
ఉక్కు పాదంతో అణిచివేసి..
ఉద్యమిస్తే.. లాఠీ ఝుళిపించి..
స్వేచ్ఛ కావాలంటే..ఖైదు చేసి..
అప్రజాస్వామ్యాన్ని ఎదిరిస్తే..
బందుక గురిపెట్టి..!!!
నిజం నినదిస్తే..
రౌడీయిజంతో బంధించి..
దౌర్జన్యాన్ని ధిక్కరిస్తే..
ఉన్మాదంపై గొంతు విప్పితే
ఉరితాడు బిగించి..
తిరగబడ్డ నాయకులను తుదముట్టించి..
ఈ.. అవినీతి, అక్రమాలు ఎన్నాళ్ళు..ఎన్నేళ్ళు..!
చేవదేరిన మా గొంతుకలు
ప్రశ్నించక మానవు..
ప్రశ్న ఆగదు.. మరి ప్రశ్న చావదు!
మానవ మేధస్సులో ప్రశ్న మళ్ళీ మళ్ళీ జనిస్తూనే ఉంటుంది
ప్రజల ఆక్రోశం తరాలు గడిచినా
ఎగిసి పడే కెరటంలా ప్రశ్న జ్వలిస్తుంది
నిరంకుశ పాలనా వ్యవస్థను దహించి వేస్తుంది..!
ప్రశ్న ప్రజల్లో చైతన్యాన్ని రగిలించి
నూతన ప్రజాస్వామిక వ్యవస్థకు
పురుడు పోస్తూ..! స్వేచ్ఛను అన్వేషిస్తూ.!
సమ సమాజ స్థాపన సాధన కోసం
ఎర్ర బావుటాలా.. స్వేచ్ఛ ప్రశ్నై శ్రమిస్తుంది..!
శ్రామిక రాజ్యానికి జీవం పోస్తుంది
ప్రశ్న ఆగదు!.. మరి ప్రశ్న చావదు!

ఎస్‌. కె. బాజీ సైదా
8897282981