మాస్కో: కొద్ది నెలలుగా ఉక్రెయిన్‌తో జరుగుతోన్న యుద్ధం కీలక దశలోకి అడుగుపెట్టిన వేళ..పుతిన్ రైఫిల్‌ను కాల్చిన సంఘటన చోటుచేసుకుంది. రియాజాన్‌లోని సైనిక శిక్షణా కేంద్రాన్ని సందర్శించిన సమయంలో రైఫిల్‌ను కాల్చి చూశారు. ప్రస్తుతం యుద్ధ వాతావరణం మరింత ఉద్రిక్తంగా ఉన్న సమయంలో ఆయన వ్యక్తిగతంగా వెళ్లి సైనిక సిబ్బందితో మాట్లాడారు. పుతిన్ కళ్లద్దాలు, చెవులకు రక్షణనిచ్చే పరికరాలు ధరించి కనిపించారు. అనంతరం ఒక నెట్‌లోపల ముందుకు వంగి స్నైపర్ రైఫిల్‌ను పేల్చారు. తర్వాత చిరునవ్వుతో కనిపించిన ఆయన.. యుద్ధంలో దూసుకెళ్లమన్నట్లు ఒక సైనికుడి చేతిపై చరిచారు.