ప్రజాశక్తి-అమరావతి: విశాఖపట్నంలో రేపు(మంగళవారం) సిఎం జగన్ పర్యటించనున్నారు. కైలాసపురం పోర్టు ఆసుపత్రి సమీపంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి సీఎం భూమి పూజ, అనంతరం జీవీఎంసీకి చెందిన 50 అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమాలు ముగిసిన తరువాత సిరిపురంలోని ఏయూ క్యాంపస్లో ఎలిమెంట్ ఫార్మా ఇంక్యుబేషన్ సెంటర్, బయో మానిటరింగ్ హబ్తో సహా ఐదు ప్రాజెక్టులకు సంబంధించిన భవనాలను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్థులతో సీఎం ఇంటరాక్ట్ కానున్నారు.