
ప్రజాశక్తి-విజయనగరం కోట : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇస్తున్న భవిష్యత్తుకు గ్యారంటీ హామీలలో భాగంగా ... చంద్రబాబు నాయుడు మహిళల కోసం ఇచ్చిన మహాశక్తి పధకాల ప్రచారం నిమిత్తం స్టిక్కరింగ్ చేసిన కారును శనివారం స్థానిక పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు పరిశీలించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, జిల్లా కార్యాలయ కార్యదర్శి రాజేష్ బాబు, గంటా పోలి నాయుడు, వేచలపు శ్రీనివాసరావు, కనకల మురళీమోహన్, నియోజకవర్గం పార్టీ నాయకులు పాల్గొన్నారు.