Apr 04,2023 20:48

హైదరాబాద్‌ : ద్విచక్ర విద్యుత్‌ వాహనాల తయారీదారు ప్యూర్‌ ఇవి వినియోగదారులను ఆకర్షించడానికి వినూత్న క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ ఉగాది, గుడి పడ్వా సందర్బంగా ''హ్యాపీ విత్‌ ప్యూర్‌'' పేరుతో 2023 మే 31 వరకు ప్రచార క్యాంపెయిన్‌ను కొనసాగించనున్నట్లు పేర్కొంది. వినియోగదారులు ఇందులో పాల్గొనడం ద్వారా రూ.5,000 విలువ చేసే గిప్ట్‌ వోచర్‌ను పొందవచ్చని పేర్కొంది. దేశ వ్యాప్తంగా తమ సంస్థకు 130 డీలర్‌షిప్‌లు ఉన్నాయని తెలిపింది. 2023 ముగింపు నాటికి 300 నగరాలకు తమ విక్రయాలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.