మెక్సికో : ప్రముఖ నవలా రచయిత, పులిట్జర్ ప్రైజ్ విజేత కోర్మాక్ మెక్‌కార్తీ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన పుస్తక ప్రచురణకర్త ఆల్ఫ్రెడ్ ఎ.నాఫ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మెక్ కార్తీ న్యూమెక్సికో రాజధాని శాంటా ఫేలోని తన నివాసంలోనే మృతి చెందినట్లు ఆల్ఫ్రెడ్ తెలిపారు. మెక్ కార్తీ రచించిన 'ది రోడ్', 'బ్లడ్ మేరిడియన్', 'నో కంట్రీ ఫర్ ఓల్డ్‌మెన్' వంటి పుస్తకాలు ఆయనకు ప్రశంసలు దక్కాయి. జుగుప్స కలిగించే మానవత్వం యొక్క చీకటి కోణాన్ని ఆయన తన రచనల్లో పేర్కొనేవారు. అందుకే ఆయన్ని ప్రసిద్ధ అమెరికన్ నవలా రచయిత విలియం ఫాక్నర్‌తో పోలుస్తారు.
కాగా, మెక్ రాసిన 'ఆల్ ద ప్రెట్టీ హార్స్' 1992లో నేషనల్ బుక్ అవార్డును గెలుచుకుంది. అయినప్పటికీ ఆయన ప్రముఖ ఇంటర్వ్యూలకు దూరంగా ఉన్నారు. అలాగే ఛిద్రమైన తండ్రీ కొడుకుల గురించి రాసిన 'ది రోడ్' అనే పుస్తకం 2007లో పులిట్జర్ ప్రైజ్‌ని సొంతం చేసుకుంది. ఈ రెండు పుస్తకాలు తర్వాత సినిమాలుగా తెరకెక్కడం విశేషం. ఇక ఆయన రాసిన క్రైమ్ థ్రిల్లర్ నవల 'నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్' సినిమాగా తెరకెక్కింది. ఈ చిత్రానికి 2008లో ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డును గెలుచుకుంది.










