Oct 23,2023 19:23

ప్రజాశక్తి-పార్వతీపురం (మన్యం జిల్లా) : దేశం చేస్తోంది రావణాసుర దహనం-మనం చేద్దాం జగనాసుర దహనం కార్యక్రమం అరుకు పార్లమెంట్‌ అదికార ప్రతినిధి డొంకాడ రామకష్ణ, మండల అధ్యక్షులు పల్ల రాంబాబు ఆధ్వర్యంలో కురుపాం నియోజకవర్గంలోని చినకుదమ గ్రామంలో సోమవారం జరిగింది. అరాచక, విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలని నినదించి, ''సైకో పోవాలి'' అని పేపర్‌పై రాసి దహనం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.