
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పినా.. కేవలం టిడిపి రాజకీయ ప్రయోజనాల కోసం అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గుడివాడలో పాదయాత్ర సందర్భంగా వ్యవహరించిన తీరు సమంజసంగా లేదన్నారు. 3 ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఒక కార్యాచరణను రూపొందిస్తోందని తెలిపారు. ఈ విషయంలో వెనకడుగు వేయబోమని అన్నారు.