ప్రజాశక్తి-హౌలగుంద(కర్నూలు) : రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మిడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా విద్యను నిర్వీర్యం చేస్తోదని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, డివైఎఫ్‌ఐ జిల్లా నాయకులు మైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులతో సమావేశమయ్యారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, డివైఎఫ్‌ఐ జిల్లా నాయకులు మైన మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మిడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా విద్యను నిర్వీర్యం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను పాఠ్యపుస్తకాలు సొంతంగా దుకాణాల్లో కొనుకోండి అని చెప్పడం దారుణమన్నారు. ప్రభుత్వం గనక విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేయక పోతే విద్యార్థులను కలుపుకోని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి చేస్తామన్నారు. అనంతరం కళాశాల ఎస్‌ఎఫ్‌ఐ కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నాగరాజు కళాశాల కమిటీ సభ్యులు గాదిలింగా, రామమూర్తి, నాగరాజు విద్యార్థులు పాల్గొన్నారు.











