ప్రజాశక్తి-రెడ్డిగూడెం(ఎన్‌టిఆర్‌జిల్లా) : రెడ్డిగూడెం మండల పరిధిలోని కూనప రాజు పర్వ పిఎసిఎస్ ద్వారా 28 మంది రైతులకు దీర్ఘకాలిక రుణాల కింద రూ.కోటి 38 లక్షల 90 వేలను పిఎసిఎస్ అధ్యక్షులు పాలంకి మోహన మురళి రెడ్డి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కష్ణ ప్రసాద్ సూచనల మేరకు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు సహకారంతో రైతాంగానికి మేలుజరగాలనే ఉద్దేశంతో ఈ ఋణాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా ఆర్బికె లను స్థాపించి దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా చేసిన విధము చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ లక్ష్మీప్రసాద్, అసిస్టెంట్ మేనేజర్ ఆంజనేయ ప్రసాద్, సూపర్ వైజర్ గోపాలకృష్ణ, సీఈవో, విస్సన్నపేట కెడిసిసి బ్యాంక్ ఛీప్ మేనేజర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










