ప్రజాశక్తి - పెద్దాపురం(కాకినాడ) : పెద్దాపురం మండలం ఆనూరు దళితపేటలోని ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మించుకుని 20 ఏళ్లుగా జీవిస్తున్నప్పటికీ అధికారులు కాలనీలో మౌలిక వసతులు కల్పించటం లేదని రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌సిఎస్ డివిజన్ కార్యదర్శి దేశెట్టి సురేష్ మాట్లాడుతూ.. ఈ కాలనీలో 150 దళిత కుటుంబాలు ఇల్లు నిర్మించుకుని జీవిస్తున్నాయన్నారు. అనేక పోరాటాలు చేయగా 80 కుంబాలకు మాత్రమే పట్టాలు ఇచ్చారన్నారు. మిగిలిన 70 మందికి వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కాలనీలో మరుగుదొడ్లు, డ్రైనేజీలు, రోడ్లు వంటి మౌలిక వసతులు లేవన్నారు. వెంటనే అధికారులు స్పందించి ఈ సమస్యల పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పైడిమల్ల బుల్లి సత్తయ్య, పైడిమల్ల నాగరాజు, సత్యవతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










