ప్రజాశక్తి కాకినాడ : తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మాజీ మేయర్, కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాపరిషత్ సెంటర్ లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద నల్ల బెలూన్లు ఎగురవేసి, బాబుతో మేము అనే ప్లే కార్డ్స్ ప్రదర్శిస్తు టిడిపి శ్రేణులు రోడ్డు పై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సుంకర పావని మాట్లాడుతూ 14 సంవత్సరాలు అవినీతి మచ్చ లేకుండా ముఖ్యమంత్రి పనిచేసిన కూడా 75 సంవత్సరాల చంద్రబాబు నాయుడు ని 32 రోజులుగా అక్రమంగా జైలులో ఉంచి పైశాచిక అనందం పొందుతున్న వైసీపీ నాయకులను ప్రజలు గమనిస్తున్నారన్నారు. అధికారదర్పంతో విర్రవీగుతున్న జగన్ కీ పతనం తప్పదని మళ్ళీ జైలు జీవితమేనని సుంకర పావని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుంకర పావని వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు చల్ల పార్వతీ, పాలిక సత్య, నక్క జ్యోతి, రేలంగి లక్ష్మి, కనకం, దుర్గ, సత్యవతి, నిర్మల, రమణ, భ్రమరాంబ, చింతభవానీ తదితరులు పాల్గొన్నారు.










