అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న 'భగవంత్ కేసరి' చిత్రం నుండి తాజాగా ఒక ప్రచార వీడియోని చిత్ర నిర్వాహకులు విడుదల చేశారు. ఇటీవలె ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఈ వీడియో విడుదలచేశారు. ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల అవుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ కుమార్తెగా శ్రీలీల నటిస్తుండగా, కాజల్ అగర్వాల్ మరో ముఖ్య పాత్రలో కనపడనున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ చిత్రంలో ప్రతినాయక పాత్ర చేశారు. ఈ సినిమాకి నిర్మాతలు హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్ సంగీతం అందించారు.










