రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన 'కాంతార' చిత్రానికి ప్రీక్వెల్‌ను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. తాజా భాగంలో తొలిభాగం ఆరంభానికి ముందు జరిగిన కథను చూపించబోతున్నారు. డిసెంబర్‌లో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుందని చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన ప్రతినిధి వెల్లడించారు. ఈ సినిమా కోసం రిషబ్‌శెట్టి గుర్రపుస్వారీతో పాటు కొన్ని ప్రాచీన యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకోబోతున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆగస్ట్ కల్లా చిత్రీకరణ పూర్తిచేసి దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.










