Dec 22,2022 14:41

ఇంటర్నెట్‌డెస్క్‌ : యూరినరీ ఇన్ఫెక్షన్స్‌ వల్ల చాలా ఇబ్బందులు పడతారు. నేటిజీవన శైలిలో కూల్‌డ్రింక్స్‌ వాడకం ఎక్కువగా ఉంది. వీటివల్ల కూడా ఇన్ఫెక్షన్స్‌ వచ్చే అవకాశముంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శీతాకాలంలో ఇన్ఫెక్షన్స్‌ బారినపడకుండా.. ముందే జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

1) రక్తంలో షుగర్‌ లెవల్‌ స్థాయి పెరిగినప్పుడు యూరినరీ ఇన్ఫెక్షన్స్‌కి గురయ్యే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. కూల్‌డ్రింక్స్‌ తరచూ తాగేవారు కూడా ఇన్ఫెక్షన్స్‌ బారినపడతారని వైద్యులు అంటున్నారు.
2) పురుషుల కంటే.. మహిళలే యూరినరీ ఇన్ఫెక్షన్స్‌కి ఎక్కువ గురవుతారు. టీనేజ్‌ వయసు అమ్మాయిలు, మహిళలు బాత్రూమ్‌కి వెళ్లిన ప్రతిసారీ పరిశుభ్రత పాటించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
3) ప్రతిరోజూ 6 నుంచి 8 గ్లాసులు నీటిని తీసుకోవాలి. శరీరానికి తగినంత నీటిని తీసుకోకపోతే.. డీహైడ్రేషన్‌కి గురవుతారు. ఆ తర్వాత ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశముంది. అందుకే తప్పనిసరిగా అజాగ్రత్త పాటించకుండా.. నీటిని తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.