Oct 28,2023 19:06

ఐపీఎస్‌ మాజీ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కింది. నీల మామిడాల నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా 'ప్రవీణ్‌ ఐపీఎస్‌' టైటిల్‌తో రాబోతోంది. షూటింగ్‌ అంతా పూర్తి చేసుకుని ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. నవంబరులో థియేటర్లలోకి తీసుకురానున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి గ్లింప్స్‌ వీడియో విడుదలైంది. నందకిషోర్‌, రోజా హీరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. దుర్గా దేవ్‌ నాయుడు దర్శకుడు.