నీవు నా చేతులకు
సంకెళ్ళు వేయించగలవు...
కానీ
నా భావాలను మార్చలేవు కదా ..!
నా మునివేళ్ళను
నరికి వేయించగలవేమో...
నా మస్తిష్కం
నీ సొత్తు కాదుగా..!
నీవు నన్ను అష్టదిగ్బంధనం
చేయగలవేమో గానీ....
నా ఈ శ్వాసను ఆపలేవు
నా కలంలోని
సిరాకు కరువొస్తే ...
నా శరీరంలోని
రక్తంతో రాస్తా
నా జాతుల అస్థిత్వాన్ని ...
నా జాతుల అస్థిత్వాన్ని
కాలరాయాలని జూస్తే
పచ్చని ఇస్తరాకు మీద
నీకు పిండం పెడతా ....
నన్ను సమాధి చేయాలనుకోకు..
నేను మొక్కనై పెరిగి పువ్వునై వికసిస్తా
గాలితో నవచైతన్యాన్ని
రగిలిస్తా.....
నేను కవిని..
ఎన్నుకోబడని
బహుజన
ప్రజా ప్రతినిధిని...
శ్వాస ఉన్నంత వరకు
పేదల ఆశయమై బతికే
మట్టి ప్రజల ప్రతినిధిని...
ఉప్పరి తిరుమలేష్
9618961384