Apr 03,2023 16:01

హైదరాబాద్‌: 'దసరా' చిత్రబృందాన్ని పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, దర్శకుడు రాజమౌళి ప్రసంశించారు. ''ఇప్పుడే 'దసరా' చూశా. వాట్‌ ఏ మూవీ. నాకెంతో నచ్చేసింది. ఈ చిత్రాన్ని చేసినందుకు నానికి అభినందనలు. దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల, నాని, కీర్తిసురేశ్‌ ఇతర చిత్రబృందం అద్భుతంగా వర్క్‌ చేశారు. ఇలాంటి చిత్రాలను మనం మరెన్నో తెరకెక్కించాలి'' అని ప్రభాస్‌ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ పెట్టారు. దీనిపై నాని స్పందిస్తూ.. ''థ్యాంక్యూ ప్రభాస్‌ అన్నా'' అంటూ ఆనందం వ్యక్తం చేశారు. అద్భుతమైన విజయాన్ని అందుకున్న 'దసరా' చిత్ర బందానికి నా శుభాభినందనలు'' అని రాజమౌళి ట్వీట్‌ చేశారు. రాజమౌళి ట్వీట్‌పై దర్శకుడు శ్రీకాంత్‌ స్పందిస్తూ 'ఏ మాట్లాడాలో కూడా నాకు అర్థం కావటం లేదు.. సర్‌ థ్యాంక్యూ వెరీ మచ్‌' అని రిప్లై ఇచ్చారు. ఇక నాని అయితే, రాజమౌళి ప్రశంసకు తెగ సంబరపడిపోయారు. 'సర్‌.. ఇది మా దసరాకు టీమ్‌కు దక్కిన ఆస్కార్‌' అని పేర్కొన్నారు.