Apr 30,2023 07:29

ఇక్కడ ఉక్కు బుల్డోజర్లు
విహరిస్తున్నారు
ఉగ్ర మూకలు సంచరిస్తున్నారు
ఉరి తాళ్ళు వేలాడుతున్నారు

ఉన్మాద క్రీనీడలు కమ్ముతున్నారు
మత జెండాలు ఎగురుతున్నారు

స్వార్థ ఎజెండాలు అమలవుతున్నారు
నియంత పాలనలు కొనసాగుతున్నారు

మొత్తంగా డెమోక్రసీ డెకాయిట్ల హస్తగతం
యావత్‌ భారతదేశం డిక్టేటర్ల పాదాక్రాంతం

ఇపుడు ఉన్నపళంగా ఉద్యమించే తరుణం
యావత్‌ భారతాన్ని విముక్తి చేసే సందర్భం

అందుకే పౌరుల్లారా సంఘటితం కండోరు
కదంతొక్కి కవాతు చేసి
లడాయికి తరలండోరు

జన ప్రభంజనమై హోరెత్తి
చీకటి కోటలు కూల్చండోరు
ప్రజాస్వామ్యాన్ని బతికించి
జాతి జెండా ఎగరేయండోరు

- కోడిగూటి తిరుపతి
9573929493