Nov 12,2023 11:32

బర్మేర్‌ :  రాజస్థాన్‌లోని భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దున గల బర్మేర్‌ జిల్లా 'బర్మేర్‌ కా పార్‌' గ్రామంలోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం 20 కిలోమీటర్లు వెళ్లి ఓటు వేయాలి. వాళ్లకు ఎలాంటి రవాణా సౌకర్యాలు లేవు. అక్కడి నుంచి నడిచి వెళ్లాలి.. లేదంటే ఒంటెలను ద్వారా వెళ్లాలి. ఈ క్రమంలో గ్రామస్థులు చాలా మంది ఓటు వేసేవారు కాదు. కొందరు పురుషులు ఓటేసి వచ్చేవారు. తాజాగా ఇసిఐ తీసుకున్న నిర్ణయంతో అధికారులు ఆ గ్రామంలో ఓ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ గ్రామంలో మొత్తం 35 ఓట్లు ఉండగా.. అందులో మహిళలు 17 మంది, పురుషులు 18 మంది ఉన్నారు. వీళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఆ గ్రామస్థుల్లో జోష్‌ నింపింది. ఒక్క ఓటు కూడా మిస్‌ కాకుండా వేస్తామని వారు చెబుతున్నారు.