
ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్యజిల్లా) : టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు రిమాండ్‌కు నిరసనగా ప్రతిపక్ష పార్టీలు చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పట్టణంలోని టిడిపి కార్యాలయం వద్ద నుంచి ఆ పార్టీ ఇన్చార్జి కస్తూరి విశ్వనాథ నాయుడు, ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, వామపక్ష పార్టీల నాయకులు చేపట్టిన ర్యాలీ నిర్వహించి టోల్గేట్ సెంటర్ వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేశారు అనంతరం ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు బలవంతంగా అడ్డుకొని వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. వ్యాపార సంస్థలు ప్రైవేటు విద్యా సంస్థలు బందుకు మద్దతు తెలిపి మూసివేశారు. పోలీసులు బలవంతంగా దుకాణాలను తెప్పించారు. ఈ ర్యాలీలో టిడిపి నాయకులు వెంకటేశ్వరరాజు దుద్యాలయం చంద్ర అనిత దీప్తి కస్తూరి కోటేశ్వరరావు, జయప్రకాష్, కొమ్మ శివ, నీలకంఠయ్య, పోకలమని, మధుసూదన్, మౌలా, చంద్రరాజు జనసేన, వామపక్ష పార్టీ నాయకులు పాల్గొన్నారు.