
న్యూఢిల్లీ: బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎపై పోటీకి 26 ప్రతిపక్ష పార్టీలు కలిసి ఐఎన్‌డిఐఎ (ఇండియా)పేరుతో కూటమి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల బెంగళూరులో జరిగిన రెండు రోజుల సమావేశంలో జాతీయ అభివృద్ది సమ్మిళిత కూటమి (ఐ.ఎన్.డి.ఐ.ఎ.) అనే పేరు పెట్టారు. అయితే ఇండియా పేరును ఉపయోగించుకోవడం సరికాదని, ఇది అక్రమ వినియోగం కిందకు వస్తుందని పేర్కొంటూ ఢిల్లీలోని బారాఖమ్బ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. డాక్టర్ అవినాష్ మిశ్రా అనే 26 ఏళ్ల యువకుడు ఈ ఫిర్యాదు చేశాడు.జాతీయ చిహ్నాల చట్టం కింద ఇండియా అనే పేరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరూ ఉపయోగించుకోరాదని ఫిర్యాదుదారు తన కంప్లయింట్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.