Aug 20,2023 14:02

ప్లిట్‌వైస్‌ లేక్స్‌ నేషనల్‌ పార్క్‌ ఆగ్నేయ ఐరోపాలో అతి పురాతన జాతీయ పార్క్‌, క్రొయేషియాలో ఇది అతిపెద్ద జాతీయ పార్క్‌. దీనిని 1949లో జాతీయ పార్క్‌ గా ప్రకటించారు. బోస్నియా, హెర్జెగోవినా సరిహద్దు వద్ద కేంద్ర క్రొయేషియాలోని పర్వత కార్స్ట్‌ ప్రాంతంలో ఉంది. ఈ జాతీయ పార్క్‌ నుంచి వెళ్లే ముఖ్యమైన ఉత్తర-దక్షిణ రోడ్డు మార్గం అడ్రియాటిక్‌ తీర ప్రాంతపు లోతట్టు క్రొయెషియన్‌ను కలుపుతుంది. ఈ రక్షిత ప్రాంతం దాదాపు 296.85 చదరపు కిలోమీటర్లలో (73,350 ఎకరాలు) విస్తరించి ఉంది. ఈ ప్రాంతం 90 శాతం లికా-సెంజ్‌ కౌంటీ భాగం కాగా, మిగిలిన 10 శాతం కర్లోవ్యాక్‌ కౌంటీ భాగం. ప్లిట్‌వైస్‌ లేక్స్‌ నేషనల్‌ పార్క్‌ను ప్రపంచవ్యాప్త తొలి సహజసిద్ధ సైట్ల మధ్య 1979లో యునెస్కో ప్రపంచ వారసత్వ రిజిస్టర్లో చేర్చింది. ప్రతి సంవత్సరం దీనిని సందర్శించే వారి సంఖ్య 12 లక్షలకు పైనే. దీనిని సందర్శించే సందర్శకులు కచ్చితమైన నిబంధనలు పాటించవలసి ఉంటుంది. ఇక్కడి ఉపరితలం నుండి చూడగలిగే 16 సరస్సులలో 12 ఎగువ సరస్సులుగా, నాలుగు దిగువ సరస్సులుగా విభజించడం జరిగింది.

55