Aug 28,2022 09:57

కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, నిమ్మగడ్డ, ఉల్లికాడలు,బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా కూరలో వేసుకునే ఆకులు. సుగంధాలు చిందించే పత్రాలు.నిండైన ఆరోగ్యానికి మెండైన ఔషదాలు. పత్రాలు. రోజూ కూరల్లో వాడే రుచికరమైన పోషకాలు. ఒకప్పుడు వీటిని భయట నుంచి కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు ఇంట్లోనే చక్కగా చిన్న చిన్న కుండీల్లో పెంచుకునే అధునాతన మొక్కలు అందుబాటులోకి వచ్చేసాయి. తక్కువ జాగాలో తక్కువ వ్యవధిలో చక్కగా కాపునిచ్చే,ఈ నవ్యతరం ఆకు మొక్కల్ని మిద్దె తోటలుగా కూడా పెంచుకోవచ్చు. వంటింకి చక్కని పోషకాలు అందిస్తూ... ఇంటికి ఆకుపచ్చని శోభ విరాజిల్లుతూ అందాల అవుతున్న ఆధునిక మొక్కల గురించి ఈ వారం 'విరితోట' లో...

 

Plants-for-spicy-curry-at-home

                                                                           కొత్తిమీర..

సాలా దినుసులుగా వాడే ధనియాలను నాటితే కూర కొత్తిమీర ఆకుకూర మొలుస్తుంది. చిన్ని చిన్ని ఆకులు కాస్త ఘాటుగా ఉండే కొత్తిమీరను చాలా రకాల కూరల తయారీలో వాడతారు. ప్రొటీన్‌, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్‌ ఏ ,బి, సి ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్న ఆకు కూర కొత్తిమీర. బిర్యాని, రసం సాంబారు, పలావ్‌, వెజిటేబుల్‌ రైస్‌, కొబ్బరి అన్నం, పచ్చళ్ళు,పప్పు కూరలు తదితర వంటకాల్లో కొత్తిమీరను స్పైసీ గా వాడుకోవచ్చు. కాస్తంత దష్టి సారిస్తే ఏడాదంతా కొత్తిమీర ఇంటిదగ్గర కుండీల్లో పండించుకోవచ్చు. ముందుగా కుండీల్లో లేదా రెండు అంగుళాలు లోతు ఉన్న ఒకటి తీసుకుని దాని నిండుగా మట్టి నింపాలి. మట్టి కాస్త గుల్లగా ఇసుక పాలు ఉంటే మంచిది. దానిలో లో కొత్త మీరు విత్తనాలు అయినా ధనియాలు వేయాలి. పైన సెంటీమీటర్‌ ఎత్తు మట్టి పొరతో కప్పాలి. మొక్కలు మొలిచే వరకూ రోజు పైన నీళ్ళు చిలికిరించాలి. ఎట్టి పరిస్థితిల్లోనూ నీళ్లు ముద్దగా నిల్వ ఉండకూడదు. పదిరోజుల్లో అంకురాలు తలలు లేపుతాయి. 70 రోజులకు కొత్తిమీర ఆ పంట వాడకానికి సిద్ధమవుతోంది. నెల, 15 రోజుల పాటు కొద్ది కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ కొత్తిమీర ఆకు పంటను నిరంతరాయంగా పొందొచ్చు. ఆరు బయట వాతావరణంలో బాగా గాలి తగిలేటట్టు కుండీలను ఉంచితే కొత్తిమీర ఆకు మరింత ఏపుగా పెరుగుతుంది. స్వాతి రకం విత్తనాలు చల్లితే కాస్త పంట తొందరగా వస్తుంది. సుధ, సింధూర రకాల పంట కాస్త ఆలస్యంగా వస్తుంది. మసాలా ఆకుల మొక్క.. కూరల్లో సువాసనలు గుప్పించే మరో ఆకు మసాలాకు. దీన్నే బిర్యానీ ఆకు, పలావ్‌ ఆకు అని కూడా అంటారు. ఆకు సన్నగా మూడు నుంచి నాలుగు అంగుళాలు పొడవు ఉంటుంది. ఇది కూరల్లో వేసుకోవడం వల్ల ఘాటైన వాసనతో పాటు రుచిని కూడా చేరుస్తుంది. దీనిలో ఎన్నో పోషకాలు, ఔషధ విలువలు ఉన్నాయి. ముఖ్యంగా కఫానికి విరుగుడుగా ఈ ఆకును ఉపయోగిస్తారు. దీనిలో ఫైబర్‌ కార్బోహైడ్రేట్లు, విటమిన్‌ బి6, విటమిన్‌ సి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం, సోడియం, కొవ్వులు కూడా ఉన్నాయి. ఇది కూడా 20 అడుగుల వరకూ పెరిగే ఒక జాతి మొక్క. కుండీల్లో రెండు లేదా మూడడుగుల ఎత్తులో చక్కగా ఆకులు పూసే సరికొత్త హైబ్రిడ్‌ మసాలా మొక్కలు ఇప్పుడు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. క్కసారి నాటిన మొక్క 15 ఏళ్ల వరకు ఆకులు వస్తూనే ఉంటుంది. వీటి పచ్చి ఆకులను, ఎండబెట్టిన ఆకులను కూడా మనం వంటలకు ఉపయోగించుకోవచ్చు.

 

 కరివేపాకు..

                                                                         కుండీలో కరివేపాకు..

తెలుగువాళ్ళకి కరివేపాకు లేని కూర ఉండదంటే అతిశయోక్తి కాదు. ఎన్నో పోషక విలువలు ఉన్న కరివేపాకును దాదాపు అన్ని వంటకాల్లో వినియోగిస్తారు. కూరలో కరివేపాకు వేస్తే ఆ సువాసనలే వేరు. కరివేపాకులో విటమిన్‌ ఏ, బి, సి, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్‌, కాల్షియం, ఐరన్‌ యాంటిఆసిడ్స్‌, అమైనో ఆసిడ్స్‌, గ్లైకోసైడ్స్‌, కాపర్‌, పాస్ఫరస్‌, మెగ్నీషియం, ఫైబర్‌ వంటివి ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు కరివేపాకు అంటే పెద్ద చెట్టుగా విస్తరించేది. ఆధునిక సాంకేతిక విధానాలు చిన్న చిన్న కుండీలో పెరిగే సరికొత్త కరివేపాకు మొక్కలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఒకటి, రెండు అడుగుల ఎత్తులోనే గుజ్జుగా ఆకులు విచ్చుకొని, రెమ్మలు అలుముకుంటున్నాయి. పైగా ఒక రెమ్మ వేస్తే చాలు కూరంతా సువాసన భరితమే. ఈ సరికొత్త ఆకులు మామూలు కరివేపాకు కంటే 20 రెట్లు సువాసను ఘాటు కలిగి ఉంటాయి. వీటిలోని బ్రెజిల్‌ కరివేపాకు ముఖ్యమైనది. ఇంటి లోపల కుండీల్లోనూ, మిద్దె తోటల కంటైనర్లు, బాస్కెట్‌లు, పాత్రలో పెంచుకోవడానికి ఈ మొక్క ఎంతో అనువుగా ఉంటుంది.

pudeena

 

                                                                        పుదీనా..

ఆకు గరిగా ఉండే పుదీనా కూడా ప్రత్యేకమైన వాసన, రుచి, ఘాటు కలిగి ఉంటుంది. దీన్ని కూడా చాలా రకాల కూరల్లో వాడతారు. పైత్యానికి, అజీర్తికి విరుగుడుగా పుదీనా వాడతారు. పుదీనాను తేనీరుగా, ఔషధాలలో, టూత్‌ పేస్టులో, మాయిశ్చరైజర్‌ క్రీములు, పచ్చళ్ళు, టానిక్స్‌, సౌందర్య లేపనాల్లో విరివిగా వినియోగిస్తున్నారు. వీటిలో పిండిపదార్థాలు, పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు, ఇనుము, పొటాషియం, భాస్వరం, క్యాల్షియం, మెగ్నీషియం, గంధకం, కొవ్వులు, క్లోరిన్‌, విటమిన్‌ సి, సోలిస్‌ యాసిడ్‌, కెరోటిన్‌, రైబోప్లోవిక్‌ సమద్ధిగా ఉన్నాయి. కణుపులు వేరులు నుండి 4 లేదా 5 అంగుళాలు పొడవు ఉన్న పుదీనా మొక్కల కాండాలే పుదీనా విత్తనాలు. ఇలాంటి కాడలను కుండీల్లో మెత్తని సారవంతమైన మట్టిలో నాటాలి. రోజూ కాస్త నీళ్లు చిలకరించాలి. మొక్క 30 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరిగి, చక్కగా ఆకులు విచ్చుకుంటుంది. మూడు నెలలు తర్వాత నుంచి పుదీనా ఆకు పంట మనం సేకరించుకోవచ్చు. సేంద్రియ ఎరువులు వేసుకుంటూ, కొద్దికొద్దిగా ఆకు కోసుకుంటూ సమపాళ్ళలో నీరు అందిస్తే కుండీల్లో నాలుగైదు సంవత్సరాల వరకు పుదీనా పంట పండించవచ్చు. వేసవిలో ఆకులు దిగాలుగా ఉంటాయి. ఆ సమయంలో కాస్త నీడను కల్పిస్తే ఇక పుదీనా మొక్కలకు తిరుగే ఉండదు. శివాలిక్‌, కిరణ్‌, కుక్రెల్‌, హిమాలయ వంటి ఎన్నో రకాలు పుదీనాలో ఉన్నాయి.

చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506