Nov 04,2022 16:15

ప్రజాశక్తి-రాజవొమ్మంగి(అల్లూరి) : ఏజెన్సీలోని గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు తయారు చేసి రంపచోడవరం ఐటిడిఏ ప్రాజెక్ట్‌ అధికారి సూరజ్‌ గనోరే సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రంపచోడవరం పీఓ చాంబర్లో వ్యవసాయ అనుబంధశాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్‌ గనోరే మాట్లాడుతూ.. వ్యవసాయ అనుబంధ శాఖలు అధికారులు ముందుగా ఐదు గ్రామాలు ఎంపిక చేసుకుని ఆయా గ్రామాలలో రైతులతో మమేకమై రైతులు మక్కువ ఉన్న పంటలపై అవగాహన కల్పించి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రాజెక్ట్‌ అధికారి ఆదేశించారు. ఏజెన్సీలోని గిరిజన రైతులు ఒక గ్రూపుగా ఏర్పడి ఆయా గ్రూపులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందజేసేందుకు ఏ చర్యలు తీసుకున్నది వ్యవసాయ శాఖ అధికారులను ప్రాజెక్ట్‌ అధికారి అడిగి తెలుసుకున్నారు. ఏజెన్సీలోని అన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలలు తయారు చేయాలని, అదేవిధంగా ఆర్‌ఓఎఫ్‌ ఆర్‌ పట్టాల భూములలో ఎ వ్యవసాయం చేస్తున్నది ఆరా తీశారు. ఏజెన్సీలోని గిరిజన రైతులందరికీ ఈ క్రాప్‌ బుకింగ్‌ తప్పనిసరిగా చేయాలన్నారు. గతంలో గిరిజన రైతులకు పవర్‌ టిల్లర్స్‌, మినీ రైస్‌ మిల్స్‌, ట్రాక్టర్లు, రోటవేటర్లు ఐటీడీఏ ద్వారా సబ్సిడీపై రైతులకు అందజేయడం జరిగిందని ఈ వ్యవసాయ పరికరాలు ఏ విధంగా రైతులు ఉపయోగించుచున్నది పీఓ అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఎన్ని టన్నులు పట్టు గుళ్ళు ఉన్నవి వీటికి సంబంధించిన ఇన్ఫాస్ట్రక్చర్‌ ఏ విధంగా ఏర్పాటు చేసింది అదేవిధంగా ఎన్ని షెడ్లు ఉన్నవి ఒక్కొక్క యూనిట్‌కు ఎంత ఖర్చు అవుతుంది గిరిజన రైతులకు ఎంత సబ్సిడీ ప్రభుత్వం నుండి వస్తుంది. తదితర వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కేజీ ఎంత రేటు ఉన్నది రైతులకు ఏ విధంగా ప్రభుత్వం నుండి సహాయం చేయుచున్నది ఆయన ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీడి, ఎ.శ్రీనివాసరావు,వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్లు, సిహెచ్‌ కెవి చౌదరి, కె.సావిత్రి,జిసిసి సీనియర్‌ మేనేజర్లు, పార్వతీశం, ముర్ల.రాజారెడ్డి, జి.చంద్రశేఖర్‌, వెలుగు యాంకర్‌ పర్సన్‌, రామరాజు,సెరికల్చర్‌ డిప్యూటీ డైరెక్టర్‌, బియంయూ రామరాజు, ఏఎస్‌ఓ కె రంగారావు తదితరులు పాల్గొన్నారు.