
ప్రజాశక్తి-అమరావతి: ఏపీలో ఎస్సై ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆగస్టు 25 నుంచి దేహదారుఢ్య పరీక్షలు (పీఎంటీ, పీఈటీ) జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన కాల్ లెటర్లను పోలీసు నియామక మండలి అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in/లో అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను సమర్పించడం ద్వారా కాల్ లెటర్ పొందొచ్చు. ఆగస్టు 24 మధ్యాహ్నం 3గంటల వరకు కాల్ లెటర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 411 ఉద్యోగాలకు గానూ ఫిబ్రవరి 19న రాత పరీక్ష నిర్వహించగా.. 1,51,288 మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. దేహదారుఢ్య పరీక్షలకు 56,116మంది ఎంపికయ్యారు.