- మంత్రి పెద్దిరెడ్డికి విద్యార్థి నేతలు వినతిపత్రం
ప్రజాశక్తి - క్యాంపస్(తిరుపతి) : ఎస్వి యూనివర్సిటీ లో మాస్టర్ ప్లాన్ రోడ్డును వేయకుండా సహకరించాలని ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. వర్సిటీలో రోడ్లు వేయడం వల్ల జరిగే నష్టాన్ని, సమస్యల గురించి తెలియజేశారు. స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి యూనివర్సిటీ మాజీ విద్యార్ధిగా విద్యార్థులకి అన్యాయం జరిగితే తను చూస్తూ ఎలా ఉంటానని, ఈ విషయం నా దృష్టికి రాగానే వెంటనే యూనివర్సిటీ విసి రాజారెడ్డికి విద్యార్థులకి, యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతినే ఈ మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం చేపట్టొద్దని ఆదేశం ఇవ్వడం జరిగిందని అన్నారు. అవసరం అయితే ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్నీ తీసుకెళ్లి యూనివర్సిటీకి అండగా ఉంటాని, ఈ రోడ్లు వేయడం వల్ల ఉస్మానియా యూనివర్సిటీ లాగ ఆక్సిడెంట్‌లు జరిగే అవకాశం వుంది కాబట్టి కచ్చితంగా మాస్టర్ ప్లాన్ రోడ్లుకి తన కూడా వ్యతిరేకం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యక్షులు సుందర్, నవీన్, శివ, సాయి పాల్గొన్నారు.










