కాలం మారిందా.. మనిషి మారాడా
పల్లెల్లో సంక్రాంతి.. పిల్లల్లో సంబరాలు..
ఏ సందడీ కనబడనంతగానా..!
హరిదాసులు.. గంగిరెద్దులు..
రంగవల్లులు.. గొబ్బెమ్మలూ..
భోగి దండలు.. భోగి మంటలు..
పిండివంటలు.. పక్కింటితో సందళ్ళు..
ఏవీ కనబడటంలేదు.. మరి అగుపడటం లేదు.
సంక్రాంతి అంటే..
రైతుల పండగ.. పశువుల పండగ
రానురాను..పలచబడుతోంది
సన్నబడుతోంది!
ఇంటిల్లిపాది..ఊరంతా
ఆనందోత్సాహాలతో
జరుపుకొనే పండగ
కళతప్పుతోంది!
హైటెక్కు మోహం
నరనరాన పాకింది
పదిమందిని కలిపేపండగ
మనిషి మనిషి బంధాలను
తెలిపే పండగ
పెద్దలను స్మరించే..
గతవైభవ చిహ్నంగా
మిగిలిపోయింది..
స్వార్థం.. సంకుచితత్వం
వృద్ధాశ్రమాల పరంపరలో
సంస్కృతీ.. సంప్రదాయాలు
కనుమరుగవ్వటం
విజ్ఞానమా? వివేకమా?
తెరలు తెంచి.. ఇరులు తుంచి
సంక్రాంతీ! కాంతీ! శాంతీ!..
నీ పేరు నిలబెట్టుకోవమ్మా..
ఈ మనిషికి నీ ఉనికినిచ్చుకోవమ్మా..!!
మంకు శ్రీను
89859 90215