ప్రజాశక్తి-కాకినాడ : వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సీఎస్ ఆరేంవో డా.పుష్కరరావు పేర్కొన్నారు. ప్రపంచ ఫిజియోథేరఫీ దినోత్సవం సందర్భంగా జిజిహెచ్ ఫిజియో థెరపీ విభాగాధిపతి డా.ఎల్.సాయినాథరావు ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహనా ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో డాక్టర్ పుష్కరరావు మాట్లాడుతూ.. వైద్య రంగంలో వ్యాయామం పాత్ర ఎనలేనిదన్నారు. ప్రతిఒక్కరూ వ్యాయామంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎఆర్‌ఎంవో డా.పి.రాహుల్, డా.పి.తులసి, డా.అనూరాధ, తదితరులు ప్రసంగించారు. అనంతరం ఫిజియో థెరపీలో ప్రతిభను ప్రదర్శించిన సంధ్య ఫిజియో థెరపీ కళాశాల, రాఘవ ఫిజియో థెరపీ కళాశాల విద్యార్థులకు షీల్డ్ బహుకరించారు. అలాగే ముఖ్యాతిథులు, సంధ్య, రాఘవ కళాశాలల ప్రిన్సిపాల్స్ డా.సూర్యప్రకాష్, డా. ఎన్.నాగరాజు, రాంబాబు లను ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో డా.సిహెచ్.సునంద, డా.గీతా సాయి, ఫిజియో థెరపీ విభాగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










