Sep 03,2023 10:56

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : సూర్యునిపై అధ్యయనం చేసేందుకు నిర్ధేశించిన ఆదిత్య ఎల్‌-1 అబ్సర్వేటరీని ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించడం హర్షణీయమని జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదిత్య ఎల్‌-1 నిర్ధేశిత ప్రయోజనం సాధించాలని శాస్త్రీయ విజ్ఞాన ఫలాలు అందరికీ అందే దిశగా కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.