
విశాఖపట్నం : వారాహి యాత్రలో భాగంగా ... జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గురువారం విశాఖలో పర్యటించనుండగా పోలీసులు ఆంక్షలు విధించారు. మొదట నిర్ణయించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో రావాలని కోరారు. విమానాశ్రయం నుంచి పోర్టు రోడ్డులోనే రావాలని పోలీసులు స్పష్టం చేశారు. పవన్ ఎక్కడా రోడ్‌షో నిర్వహించకూడదని, బయటికొచ్చి అభివాదాలు కూడా చేయకూడదని సూచించారు. వారాహి యాత్రలో భాగంగా సాయంత్రం 5 గంటలకు నగరంలోని జగదాంబ కూడలిలో నిర్వహించే సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు.