Nov 14,2023 12:46

ప్రజాశక్తి-ఉరవకొండ (అనంతపురం) : జనసేన- తెలుగుదేశం పార్టీల మధ్య నియోజవర్గ స్థాయిలో నిర్వహించే సమావేశాలు, ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహణకు జనసేన పక్షాన ఉరవకొండ నియోజవర్గం నుంచి గౌతమ్‌ కుమార్‌ ను సమన్వయకర్తగా ఆ పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ నియమించినట్లు జిల్లా నాయకులు తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుండి అధ్యక్షులు ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ ఆయా కార్యక్రమాలు జయప్రదం చేయడానికి విశేష కఅషి చేసిన ఆయనకు ఉరవకొండ నియోజకవర్గం జనసేన - టిడిపి సమన్వయ బాధ్యత క్రియాశీలక బాధ్యతలు అప్పగించారు. ఉభయ పక్షాల సమావేశాలు ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహనకు పాయింట్‌ ఆఫ్‌ కాంటాక్ట్‌ గా గౌతమ్‌ కుమార్‌ నియమితులైన సందర్భంగా జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్‌ రెడ్డికి జనసేన నాయకులకు, కార్యకర్తలకు గౌతమ్‌ కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు.