చిగురుటాకుల్లో వెన్నెల చూపుల్లో తడిసి
లేలేత గాలులతో మురిసి
పల్లె నిండుగా పులకరిస్తోంది.
చిన్ని సరదాల్ని సూర్యకిరణాల్ని వొంపుతూ
ముఖంలోంచి ఆనందాలు ఉదయిస్తున్నాయి
ఆరుబయట అట్లానే
చిరునవ్వులు వేచి వున్నాయి.
పల్లెతనం అమ్మతనం ఎంచక్కా
ఆప్యాయంగా నిమురుతున్నాయి.
వేసవి అయితే చాలు
పిల్లలు పల్లెకు రెక్కలు కట్టుకుని
ఎగురుతున్నారు.
మామిడిచెట్ల నీడలో.. జీడిచెట్ల కొమ్మల్లో..
అడుగులు వడివడిగా
మురిసిపోతున్నాయి.
మట్టి పరిమళాల్ని అద్దుకుని
మంచు బిందువుల్ని పూసుకుని
ఎగిరే పక్షుల వెంట
ఆనందాలు సాగిపోతున్నాయి
కరిగిపోతున్న కలల్ని ఎత్తుకుని
నా పల్లెలో వాలిపోతాను..
దోసిళ్ళలో చిరునవ్వుల్ని
వెలిగించుకుని
అలసిన క్షణాల నుంచీ
అలా సేదదీరుతుంటాను.
గవిడి శ్రీనివాస్
70192 78368