న్యూఢిల్లీ : జొహాన్నెస్‌బర్గ్‌లో జరగనున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ మంగళవారం ఉదయం దక్షిణాఫ్రికాకు బయల్దేరారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సారి బ్రిక్స్ సమావేశం వివిధ రంగాల్లో సభ్య దేశాల మధ్య బలమైన సహకారానికి సంబంధించిన అజెండాను పరిశీలిస్తుందని వెల్లడించారు. ''పేద దేశాలకు సంబంధించిన సమస్యలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలు, బహుళపక్ష వ్యవస్థల సంస్కరణలను చర్చంచడానికి బ్రిక్స్ విలువైన వేదికగా మారిందని భావిస్తున్నాను'' అని ప్రధాని తన ప్రకటనలో తెలిపారు.
. ''జొహాన్నెస్‌బర్గ్‌లో జరగనున్న బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు వెళుతున్నాను. బ్రిక్స్-ఆఫ్రికా, బ్రిక్స్‌ప్లస్ సమావేశాలు కూడా జరగనున్నాయి. పేద దేశాల సమస్యలు, ఇతర అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు ఇది వేదికగా మారింది'' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఆగస్టు 22- 24 వరకు 15వ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం గ్రీస్ పర్యటనకు వెళ్లనున్నారు.