Jan 17,2023 10:10

ముంబయి : ఒప్పో తన 5జి విభాగంలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఒప్పో ఎ78ను విడుదల చేసింది. 8 జిబి ర్యామ్‌, 256 జిబి స్టోరేజీతో దీన్ని ఆవిష్కరించింది. జనవరి 18నుంచి అమ్మకానికి పెడుతున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. సింగిల్‌ వేరియంట్‌లో ఆవిష్కరించిన ఈ ఫోన్‌ ధరను రూ.18,999గా నిర్ణయించింది. 5000ఎంఎహెచ్‌ బ్యాటరీ, వెనుకాల 50 ఎంపి, 12.5, 2 ఎంపి కెమెరాలతో సహా సెల్ఫీ కోసం 8ఎంపి కెమెరాను అమర్చింది. ఆన్‌లైన్‌లో కొనుగోళ్లపై 10% వరకు తగ్గింపును ఇస్తున్నట్లు తెలిపింది.