ప్రజాశక్తి-కోవూరు (నెల్లూరు) : కోవూరు సహకార చక్కెర కర్మగారాన్ని తెరిపించి సహకార రంగంలోనే నడిపించాలని షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ కన్వీనర్ గండవరపు శ్రీనివాసులు కోరారు. సోమవారం షుగర్ ఫ్యాక్టరీ ఆవరణంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ... ఫ్యాక్టరీ నడవడం ప్రారంభించిన తర్వాత వందలాది రైతు కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడ్డాయని ఫ్యాక్టరీకి చెరుకు తోలే ఎడ్ల బండ్లవారు, ట్రాక్టర్ యజమానులు, కార్మికులు, రోజువారి కూలీల కుటుంబాల జీవనానికి వారి జీవన పరిస్థితులు మెరుగుకు ఫ్యాక్టరీ ఎంతో సహకారిగా ఉంటూ నెల్లూరు బాంబే రోడ్ పక్కనే సీజన్లో ఎంతో సందడిగా ఉండేదని అకస్మాత్తుగా ఫ్యాక్టరీ నష్టాల్లోకి పోయి మూతపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకార చక్కర ఫ్యాక్టరీల పట్ల అనుసరించిన విధానాలు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీకి ఎన్నికైన బాడీ లేకుండా చేసి పర్సన్ ఇంచార్జ్ లను వేసి నడపటం ఫ్యాక్టరీ ఎండి ల అవినీతికి అంతులేకుండా పోవడమే దీనికి కారణమన్నారు ఫ్యాక్టరీ అభివృద్ధికి ఎండిలు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. 6.47 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుకు శ్రద్ధ చూపలేదని ఈ కారణాలతో ఫ్యాక్టరీ మూత పడిందని అన్నారు. రైతులు విధిలేని ఎలక్ట్రానిక్స్ చెరుకు వేయటం మాని ఫ్యాక్టరీ నుండి రావాల్సిన బకాయిల కోసం పలు ఆందోళన చేశారని అన్నారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారి రాజకీయ నాయకులు చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని వాగ్దానాలు చేస్తూ వచ్చారని గత ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే షుగర్ ఫ్యాక్టరీని పునరిద్ధరిస్తామని పాదయాత్రలో బుచ్చిరెడ్డిపాలెం సభలో జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఆ వాగ్దానం తుంగలోతొక్కి ఇప్పుడు ఫ్యాక్టరీకి లిక్విడిటరను వేసి ఫ్యాక్టరీ రియల్ ఎస్టేట్‌దారులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సూర్యనారాయణ, రైతు సంఘం జిల్లా నాయకులు చండ్ర రాజగోపాల్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంగయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీరాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు, జన్నలగడ్డ వెంకమ్మ రాజు, రైతు నాయకులు షేక్ షాన్హజ్, అఖిలపక్ష రైతు నాయకులు గంగపట్నం రమణయ్య, తెలుగు రైతు నాయకులు మెట్టు విజయకుమార్ రెడ్డి, జనసేన నాయకులు గుడి హరి రెడ్డి, చప్పడి శ్రీనివాస్ రెడ్డి, షుగర్ ఫ్యాక్టరీ షేర్ హౌల్డర్స్ పాల్గొన్నారు.










