Aug 01,2023 10:46
  • ఒంగోలు మున్సిపల్‌ కార్యాలయం ముట్టడి : కార్మికుల నిరసనతో వెనుదిరిగిన అధికారులు

ప్రకాశం : ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ... నేడు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు వారి సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్‌ కార్యాలయాలను ముట్టడిస్తున్నారు. అందులో భాగంగా ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్‌ కార్మికులంతా తమ విధులను బహిష్కరించి కార్యాలయాన్ని ముట్టడించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగం కార్మికులను తక్షణమే పర్మినెంట్‌ చేయాలంటూ డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్యాలయాన్ని మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఇంజనీరింగ్‌ విభాగం కార్మికులు, సిఐటియు నాయకులు కలిసి ముట్టడించారు. కార్యాలయ ప్రధాన ద్వారాన్ని మూసివేసి నిరసన తెలిపారు. కార్యాలయానికి వచ్చిన ఇంచార్జ్‌ మున్సిపల్‌ కమిషనర్‌, డిఈ షేక్‌ సుభానిలు కార్మికుల నిరసనను చూసి వెనుదిరిగారు. కార్మికుల ఆందోళన కొనసాగుతోంది.

rajam

                                                             రాజాం మున్సిపల్‌ కార్యాలయం ముట్టడి

విజయనగరం : మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను వెంటనే పర్మినెంట్‌ చేయాలని, ఎన్నికల ముందు పాదయాత్రలో సిఎం జగన్‌ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్‌.రామ్మూర్తి నాయుడు డిమాండ్‌ చేశారు. రాజాం మున్సిపల్‌ కార్యాలయంను ముట్టడించారు.

pidugurallu

                                                            పిడుగురాళ్ళ మున్సిపల్‌ కార్యాలయం ముట్టడి

మున్సిపల్‌ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ... పిడుగురాళ్ల మున్సిపల్‌ కార్యాలయాన్ని సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు ముట్టడించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆంజనేయులు నాయక్‌ ప్రసంగించారు.

 

221

                                                                పార్వతీపురంలో కార్మికుల అరెస్టులు

మన్యం : పార్వతీపురంలో మున్సిపల్‌ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. కార్మికుల ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట, వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు కార్మికులను బలవంతపు అరెస్టులు చేశారు.

334

 

33
                                          కావలిలో మున్సిపల్ కార్యాలయం ముట్టడి

 

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు అనుబంధం రాష్ట్ర కమిటి ఇచ్చిన మేరకు మంగళవారం రోజు తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కార్యాలయం ముందు సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో కొనసాగుతున్న ముట్టడి. కార్యక్రమం కార్మిక సంఘ నాయకులతో చర్చలు జరుగుతున్న మున్సిపల్ కమిషనర్.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు అనుబంధం రాష్ట్ర కమిటి ఇచ్చిన మేరకు మంగళవారం రోజు తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కార్యాలయం ముందు సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో కొనసాగుతున్న ముట్టడి. కార్యక్రమం కార్మిక సంఘ నాయకులతో చర్చలు జరుగుతున్న మున్సిపల్ కమిషనర్.

 

223
99
                             మార్కాపురంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడి : ప్రకాశం

 

887
                          రాజంపేట టౌన్-అన్నమయ్యలో మున్సిపల్ కార్యాలయం ముట్టడి

 

223
                                                       అద్దంకి ప్రకాశం

 

112
                                              మండపేట - తూర్ప గోదావరి

 

889
                                శ్రీకాకుళం లో 587 మంది మున్సిపల్ కార్మికులు అరెస్ట్
554
                                                  ఏలేశ్వరం - కాకినాడ

 

3322
                                                      తాడేపల్లి - గుంటూరు