ప్రజాశక్తి-వెల్దుర్తి(కర్నూలు) : వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీ నగరం గ్రామంలో కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 11 గంటలకు వడ్డే జగదీష్(22) ఇంట్లో లైట్ మారుస్తుండగా కరెంట్ షాక్ తగిలి స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు జగదీష్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకంరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకునిన దర్యప్తు చేస్తున్నారు.










