
శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక జంటగా 'అనుకున్నవన్ని జరగవు కొన్ని' అనే సినిమా తెరకెక్కుతోంది. శ్రీ భారత ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకి జి.సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను అల్లరి నరేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ 'అనుకున్నవన్ని జరగవు కొన్ని' టైటిల్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది, పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు నేను నటించిన 'సిల్లీ ఫెలోస్' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా విజయవంతమై టీమ్ అందరికీ మంచి పేరు రావాలి, దర్శకుడిగా సందీప్ బిజీ కావాలి'' అని అన్నారు. నవంబర్ 3న సినిమా విడుదల చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.