ప్రజాశక్తి-విజయనగరంటౌన్ : వీఆర్‌ఏల సమస్యల పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షులు కే గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న తెలంగాణలో వీఆర్‌ఏలను నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించి ప్రమోషన్లు ఇస్తున్నారని, ఉద్యోగ భద్రత కల్పించారని, ఇక్కడ మాత్రం ఇచ్చిన డిఏని తిరిగి మా దగ్గర నుంచి ప్రభుత్వం రికవరీ చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమోషన్లు లేవు, పే స్కేల్ అమలు జరగడం లేదు, నామిని వీఆర్‌ఏలను రెగ్యులర్ విఆర్‌ఎలుగా గుర్తించలేదు, పని భారం మాత్రం పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఆగస్టు 25న విజయవాడ వెళుతున్నామని డిప్యూటీ తహశీల్దార్ కోటేశ్వరరావుకి మంగళవారం వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ , గోపాల్ ,రాజు, వీరాస్వామి, సన్యాసప్పుడు , రాములప్పుడు, పెంటయ్య, గౌరీ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.










