Sep 26,2023 16:11

ప్రజాశక్తి-బొబ్బిలి(విజయనగరం) : పైశాచిక ఆనందం కోసమే చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసిందని టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి బేబినాయన, మాజీ ఎమ్మెల్యే తెంటు రాజా అన్నారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా బొబ్బిలిలో 14వరోజు దీక్షలు కొనసాగాయి. దీక్షా శిబిరంలో మంగళవారం బేబినాయన, తెంటు రాజా కూర్చుని నిరసన తెలిపారు. వైసీపీపై ప్రజా వ్యతిరేకిత పెరగడంతో ఓర్వలేక పైశాచిక ఆనందం కోసం చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేశారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకు బుద్ది చెప్పి టీడీపీను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దీక్షలకు జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరి, నియోజకవర్గ ఇంచార్జి జి.అప్పలస్వామి, సీపీఐ పట్టణ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌, లోక్‌ సత్తా జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర్‌ మద్దతు ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.