ప్రజాశక్తి-కర్నూల్ స్పోర్ట్స్ : ఒలంపిక్ డేను పురస్కరించుకుని శుక్రవారం నిర్వహిచిన క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ , కర్నూలు జిల్లా ఒలంపిక్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో పోటీలను నిర్వహిస్తున్నరూ అందులో భాగంగా శుక్రవారం నాడు బీ కాంప్ లోని ప్రభుత్వ బిఇడి కళాశాల మైదానంలో బాస్కెట్ బాల్ పోటీల ప్రారంభ కార్యక్రమనికి అతిథిగా ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ వచ్చేసి క్రీడాకారులను పరిచయం చేసుకుని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేహదారుఢ్యానికి క్రీడలు ఎంతగానో దుహదపడతాయని ప్రతి క్రీడాకారుడు ఏదో క్రీడలో సాధన చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన ఉద్భోదించారు క్రీడల అభివృద్ధికి తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఆయన తెలియజేశారు. క్రీడల్లో పథకాలు సాధించే వారికి మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు. నేటి ఉదయం స్టేడియంలో జరిగిన అథ్లెటిక్స్, పోటీలలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడుకి ఈ జగదీశ్ కుమార్ పాల్గొని జండా ఊపి పరుగు ను ప్రారంభించరూ అనంతరం తెక్వండో పోటీలను పంచ్ చేస్తు అధ్యక్షుడు జగదీశ్ కుమార్ ప్రారంభించరూ కార్యక్రమంలో జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసులు ఒలింపిక్ సభ్యులు అవినాష్ , పి.సునీల్ కుమార్, రుద్ర రెడ్డి , జిల్లా తెక్వండో కార్యదర్శి శోభన్ బాబు మాస్టర్ సుందర్ రాజ్ , తెక్వండో ఇంచార్జి మాస్టర్ సతీష్ కుమార్ సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.










